• Login / Register
  • National News | విదేశాల్లోఉన్నఆస్తులు వెల్ల‌డించాల్సిందే

    National News | విదేశాల్లోఉన్నఆస్తులు వెల్ల‌డించాల్సిందే
    హెచ్చ‌రించిన ఆదాయ‌ప‌న్ను శాఖ‌
    ఐటీఆర్ ఫైల్‌కు డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు గ‌డువు
    Hyderabad : ఆదాయ ప‌న్ను చెల్లింపు దారుల‌కు ఆ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు. ఆయా దేశాల‌లో ఆర్జించిన ఆదాయాన్ని వెల్ల‌డించాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విదేశాల‌లో ఉన్న ఆదాయ వివ‌రాలు వెల్లడించకుంటే రూ.10లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆదివారం హెచ్చరిస్తూ.. `కంప్లయన్స్‌ కం అవేర్‌నెస్‌` ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను దాఖ‌లులో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని పన్ను చెల్లింపుదారులకు సూచించింది. భారతీయ పన్ను చెల్లింపుదారులు విదేశీ బ్యాంక్ ఖాతా, నగదు రూప బీమా, యాన్యుటీ కాంట్రాక్ట్, సంస్థ, వ్యాపారంలో ఆర్థిక భాగస్వామ్యం, రియల్ ఎస్టేట్, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీ వంటి ఏదైనా మూలధన ఆస్తి గురించి సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని ఆర్థిక శాఖ పేర్కొంది.
              పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం ‘పన్ను విధించదగ్గ పరిమితి కంటే తక్కువగా’ ఉన్నప్పటికీ తమ ఐటీఆర్‌లో విదేశీ ఆస్తి (FA), విదేశీ మూలధార ఆదాయం (FSI) షెడ్యూల్‌ని తప్పనిసరిగా పూరించాలని పేర్కొంది. ఐటీఆర్‌లో విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని బహిర్గతం చేయని పక్షంలో రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. 2024-25కి సంబంధించి ఇప్పటికే ఐటీఆర్‌ను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు క్యాంపెయిన్‌లో భాగంగా ఎస్ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్‌ను పంపనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) పేర్కొంది. ఐటీఆర్  2024-25 లో విదేశీ ఆస్తుల వివరాలను ఇవ్వని వారికి గుర్తు చేయడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం అని పేర్కొంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31గా గడువు నిర్ణయించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే అని ఆదాయ ప‌న్ను శాఖ వెల్ల‌డించింది.
    *  *  *

    Leave A Comment